ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తమిళనాడులోని తిరువళ్లూరు కక్కలూర్ చిప్‌కాట్ ప్రైవేట్ పెయింట్ ఫ్యాక్టరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దీంతో పనుల్లో ఉన్న కూలీలు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరో ఫ్యాక్టరీలో పని చేస్తున్న వ్యక్తి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా.. ఫ్యాక్టరీ నుంచి బ్యారెల్ ఎగిరి మీద పడి మృతి చెందాడు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఓ మహిళ పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు మూడు కోట్ల విలువగల వస్తువులు దగ్ధమైనట్లు వెల్లడించారు. అగ్ని మాపక సిబ్బంది దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఫ్యాక్టరీలోకి వెళ్లి పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు కాలిపోయి కనిపించారు. వారి మృతదేహాలను తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.