ప్రతిపక్షం, ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మొదటి దశలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలితి ప్రాంతాలకు చెందిన 102 నియోజవర్గాల పోలింగ్ కు నోటిఫికేషన్ రేపు (20న) జారీ అవుతుంది. తమిళనాడులో 39 స్థానాలు, రాజస్థాన్ లో 12, ఉత్తరప్రదశ్ లో 8, మద్య ప్రదేశ్ లో 6, ఉత్తరాఖండ్, అస్సోం, మహారాష్ఱ్రల్లో అయిదేసి నియోజకవర్గాలకు, బీహార్ లో 4, పశ్చిమ బెంగాల్ లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయల్లో రెండేసి, చత్తిస్ గఢ్,మిజోరం, నాగాలాండ్ , సిక్కిం, త్రిపుర, అండమాన్-నికోబార్ దీవుల, జమ్ము-కశ్మీ లక్షద్వీప్, పుదులో ఒక్కొక్క నియోజవర్గానికి నోటిఫికేషన్ బుధవారం విడుదల అవుతుంది. ఈ నెల 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చే నెల 19న పోలింగ్ జరుగుతుంది.