చల్లబడ్డ తెలంగాణ.. మరో ఐదు రోజులు వానలు

హైదరాబాద్‌, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: రాష్ట్రానికి మరో 5 రోజులు వాతావరణ శాఖ అధికారులు రెయిన్‌ అలర్ట్‌ జారీచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఆవర్తన ద్రోణి కారణంగా రెండు రోజులుగా రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారి గా మారిపోయిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏ. శ్రావణి తెలిపారు. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు మధ్య ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, ఈశాన్య రాజస్థాన్‌ నుంచి మరఠ్వాడా మీదుగా మరొక ఉపరితల ద్రోణి ఏర్పడిందని చెప్పారు. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం నెలకొన్నదన్నారు. గత 24 గంటల నుంచి 20–30 కి.మీ వేగంతో గాలులు వీచాయని.. వచ్చే ఐదు రోజులూ ఇలాగే ఉంటుందని డాక్టర్‌ శ్రావణి వివరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షసూచన ఉందని తెలిపారు. 12వ తేదీ నుంచి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు డాక్టర్‌ శ్రావణి తెలిపారు.

Spread the love

Related News