Trending Now

Ladakh: లద్ధాఖ్‌లో మరో ఐదు కొత్త జిల్లాలు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

త్వరలో జమ్మకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. లద్ధాఖ్ లో మరో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రెండు జిల్లాలు 1. లేహ్; 2. కార్గిల్ ఉండగా, మరో ఐదు జిల్లాలు నూతనంగా ఏర్పాటు చేస్తామని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు. వాటిని జన్స్కర్, ద్రాస్‌, షామ్‌, నుబ్రా, చాంగ్‌థాంగ్‌‌లుగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ ప్రకారం లద్ధాఖ్‌ అభివృద్ధి, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ నిర్ణయంతో ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని షా చెప్పారు.

Spread the love

Related News