ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గోవాలో జరిగిన ఇండియన్ ఉమెన్స్ లీగ్ 2లో పాల్గొన్న సందర్భంగా ఇద్దరు మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణులపై దాడి, దుష్ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) మంగళవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దీపక్ శర్మను సస్పెండ్ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఖాడ్ ఎఫ్‌సి క్లబ్‌ను కూడా కలిగి ఉన్న దీపక్ శర్మ, మార్చి 28 రాత్రి ఆటగాళ్ల గదిలోకి చొరబడి శారీరకంగా దాడి చేశాడని సమాచారం.