Trending Now

అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ని ఏర్పాటు చేయండి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 8 : పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యంమంత్రి భట్టి విక్రమార్క ను అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలోని దివ్య నగర్ అయ్యప్ప టెంపుల్ ముందర ఉన్న 534 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిని కాపాడి సదరు ప్రాంతంలో అంబేద్కర్ స్టడీ సెంటర్ ని నిర్మించాలని వినతి పత్రం సమర్పించారు. ఆ ప్రభుత్వ స్థలంలో జిల్లాలోని నిరుద్యోగులు అందరికీ ఉపయోగపడే విధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఏర్పాటుచేసి ప్రభుత్వం ఆ భూమిని స్వాధీన పరుచుకోవాలని డిమాండ్ చేశారు.

వెంటనే స్పందించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తొందరలోనే ఆ సర్వే నంబర్ లో గల భూమిని సర్వే చేయించి అంబేద్కర్ స్టడీ సర్కిల్ కి కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం గణేష్, ఉపాధ్యక్షుడు దామ భూమేష్, పట్టణ అధ్యక్షుడు కత్తి నవీన్, రవి, అరుణ్ , శ్రీనివాస్,ఎల్మల రంజిత్, బోర శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News