ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ నెల 30 లోపు లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎంపీ అభ్యర్థులకు మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. సమన్వయ సమావేశాలను పూర్తిచేసిన అనంతరం క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కనీసం రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.