Former Director of Telangana Digital Media Konatham Dileep: డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో సైబర్ క్రైం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రభుత్వంపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారనే కారణంగా అరెస్ట్ చేశారు. అయితే ఆయన అరెస్ట్ ను బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలకు నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే పోలీసులు అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసమర్థ ప్రభుత్వాన్ని దిలీప్ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతుందని, ప్రశ్నిస్తున్న దిలీప్ గొంతు నొక్కాలనే ఉద్దేశంతో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. పోలీసులు ఏ కేేసులో అదుపులోకి తీసుకున్నారో కూడా చెప్పలేదని, ప్రజాపాలన అంటే..ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా? అని ప్రశ్నించారు.