Former Jharkhand CM Champai Soren joins BJP: ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరారు. ఇటీవల జేఎంఎం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు జేఎంఎం నేత, సీఎం హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లగా..చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత సీఎం బాధ్యతల నుంచి చంపై సోరెన్ వైదొలిగారు. ఈ క్రమంలో సొంత పార్టీ అధినాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ చేరుతున్నట్లు మాజీ సీఎం చంపై సోరెన్ తెలిపారు. రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ సమక్షంలో తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. ఆదివాసులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు.