ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రైతులను ఆదుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యానికి బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా ను అమలు చేయాలని.. రైతు ఋణమాఫీ వెంటనే చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కరెంట్, నీళ్లు ఇవ్వక పోవడం కాంగ్రెస్ వైఫల్యమని.. వాస్తవాలు చెబితే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ పై ముప్పేట దాడి చేస్తున్నారన్నారు. 24 గంటల్లో కూడవెల్లి వాగు లోకి నీళ్లు ఇవ్వకుంటే, మల్లన్న సాగర్ ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు.