Trending Now

ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 08: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ.. తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ క్రోది నా అంత శోభయమానంగ విరిజిల్లాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. ఈ క్రోది నామ సంవత్సరంలో అన్ని పాలద్రోలి అన్నింటా శుభం జరగాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఈ కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు..

Spread the love

Related News

Latest News