Trending Now

అమ్మ దయతో అన్నింటా శుభం జరగాలి..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 13: సిద్దిపేట రూరల్ మండలం చింత మడక గ్రామంలో జరుగతున్న పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవం లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట రూరల్ మండలం చింత మడక గ్రామం లో జరుగుతున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు శనివారం రోజున అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో అమ్మ దయ దీవెనలతో మనం చేసే కార్యం సఫలం కావాలని, చింత మడక గ్రామ ప్రజలకు అన్నింటా శుభం చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్బంగా ముదిరాజ్ కుల సంఘ ప్రతినిధులు, గ్రామస్తులు హరీష్ రావుని సన్మానించారు.

చింత‌మ‌డ‌క‌లోని రామాల‌యం ప్ర‌త్యేక‌త..

ఆలయ నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేశారు. తమిళనాడుకు చెందిన 150 మంది శిల్పులు ఈ మహత్కార్యంలో పాలుపంచుకున్నారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాలు శ్రమించి ఓ రూపునిచ్చారు. మూలవిరాట్‌ తమిళనాడులోని మహాబలిపురంలో రూపుదిద్దుకుంది. పట్టాభిరాముడి పరివారాన్నంతా ఏకమూర్తిగా తీర్చిదిద్దడం ఇందులోని ప్రత్యేకత. సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్‌ సమేత రామచంద్రస్వామితోపాటు బ్రహ్మ, ఈశ్వరుడు, వినాయకుడు, వశిష్ఠ, నారద మునీంద్రుల మూర్తులను ఇమిడ్చిన తీరు అబ్బురపరుస్తుంది. వనవాసం తర్వాత శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన పుష్యమి నక్షత్రంనాడే చింతమడకలో పట్టాభిరాముడి ప్రతిష్ఠ జరుగుతుండటం విశేషం.

Spread the love

Related News

Latest News