ప్రతిపక్షం, సిద్దిపేట, మే 13: చిన్నకోడూర్ మండలం గంగాపూర్ గ్రామం లో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీరప్ప ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, బీరప్ప స్వామి దయ వల్ల అందరం సల్లగా ఉండాలని, ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలన్నారు. సిద్దిపేట అభివృద్ధి లో దినదినాభివృద్ధి సాదించి ఆదర్శం గా నిలుస్తుందన్నారు. గంగా పూర్ మీదుగా రింగ్ రోడ్డు, చుట్టూ అన్ని డబుల్ రోడ్లు చేసుకున్నామన్నారు. ఆ స్వామి దయ మన అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆలయ ప్రతినిధులు హరీష్ రావు ని సత్కరించారు. అదేవిదంగా మాచా పూర్ గ్రామం లో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.