ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 23: నంగునూర్ మండలంలోని ఆంక్షపూర్ రేణుక ఎల్లమ్మ దేవాలయ నాలుగవ వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన బోనాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మ దయతో అందరం ఆరోగ్యంగా ఉండాలనీ ఆకాంక్షించారు. అన్నింటా మంచి జరగాలని, బంగారు పంటలు పండాలని, పిల్లల భవిష్యత్ చదువులు వెలుగొందాలని అమ్మవారిని వేడుకున్నారు.
అనంతరం శ్రీ హనుమాన్ విజయోత్సవం సందర్బంగా సిద్దిపేట శ్రీ రామ రాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయం లో హనుమాన్ మాల దారణ స్వాముల బిక్షా కార్యక్రమం లో పాల్గొన్నారు. తదనంతరం సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం జేపీ తండా గ్రామం లో శ్రీ దుర్గా వీరాంజనేయ స్వామి విగ్రహ నూతన ఆలయ ప్రతిష్టా కార్యక్రమం లో పాల్గొన్నారు. నంగునూర్ మండలం రాంపూర్ గ్రామం లో శ్రీ సీతా రామ చంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని గట్ల మల్యాల గ్రామం లోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ ఎల్లమ్మ దేవాలయం లో అమ్మవారిని దర్శించుకున్నారు.