ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు అండగా మేము, కేసీఆర్ ఉంటారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. గతేడాది ఇదే సమయానికి కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చాం’ అని అన్నారు. రైతులు ధైర్యంగా ఉండండి. మీకు తోడుగా కేసీఆర్ గారు కూడా మీ దగ్గరికి వస్తున్నారు. రైతులు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి.. అందరం కలిసి ప్రభుత్వంపై కొట్లాడి ఇచ్చిన హామీలు తెచ్చుకుందామని అన్నారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 – 25 వేలు.. పంటకు క్వింటాల్‌కు 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.