Trending Now

ఎంపీ రంజిత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఅర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019 లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారని.. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చామని, నియోజక వర్గంలో స్వేచ్చ ఇచ్చామన్నారు. మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్నారు.

గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసని ఆయన గుర్తిచేశారు. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని.. అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవు. స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారని అన్నారు. ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొని ఉందని.. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News