హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్‌లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు రాగా.. మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. శ్రీనివాస్ గౌడ్‌కు గన్‌మెన్‌లు అవసరమో? లేదో? తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మార్చ్ 19కి వాయిదా వేసింది.