AP EX MLA David Raju Expired: మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ నేత డేవిడ్ రాజు(66) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డేవిడ్ రాజు..హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1999లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి మొదటిసారి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత 2014లో వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పోటీచేసి మెజార్టీతో గెలుపొందారు.
మళ్లీ రెండేళ్లకే ఆయన టీడీపీలో చేరారు. పార్టీలో జరిగిన గొడవల కారణంగా తిరిగి వైసీపీ గూటికి చేరారు. గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.