ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. గతేడాది ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రహేల్ నిందితుడిగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్ పారిపోయాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే పంజాగుట్ట పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. జడ్జి ముందు రహేల్ ను పోలీసులు హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో చంచల్ గూడ జైలుకు తరలించారు.