Trending Now

మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ నామినేషన్ దాఖలు..

బీజేపీలో ఉంటునే రహస్యంగా ఒక్కరే వచ్చి నామినేషన్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 25: ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తమ పార్టీ శాసనసభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులతో లాంఛనంగా భారీ ర్యాలీ రూపంలో వచ్చి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా కు నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా.. ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తాను ఒకరే రహస్యంగా వచ్చి రిటర్నింగ్ అధికారికి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈయన తెలుగుదేశం హయాంలో శాసనసభ్యుడిగా ఎంపీగా ఎంపికై జిల్లా ప్రజలకు సుపరిచితుడైన నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడమే కాకుండా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ఉండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలలో తనదైన శైలిలో రాజకీయ చక్రాలు తిప్పారు. మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి శిష్యుడిగా పేర్కొనబడే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో చేరి కొన్నాళ్లే ఉండి గత కొన్ని సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఖానాపూర్ నియోజకవర్గం బీజేపీ టికెట్టు పొంది ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత తనకు భారతీయ జనతా పార్టీ కచ్చితంగా ఎంపీ టికెట్ ను కేటాయిస్తుందని పకడ్బందీ ప్రణాళికతో పక్కాగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ లోకసభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో దూసుకెళ్తూ ఉన్నారు. ఈ తరుణంలో సెట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు కు రాథోడ్ రమేష్ కు అంతర్గత కలహాలు, విభేదాలు మొదలై బీజేపీ జాతీయస్థాయి అధిష్టానం వరకు చేరాయి. అయినప్పటికీ మనోధైర్యంతో బీజేపీ ఎంపీ టికెట్ కోసం చివరి వరకు ఆశించిన రాథోడ్ రమేష్ కు బంగాపాటే మిగిలింది. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి,ఎంపీ గోడం నగేష్ కు ప్రకటించిన తర్వాత.. అలిగి మలిగి ఉన్నరాథోడ్ రమేష్ ను బీజేపీ నేతలు సర్ది చెప్పి భవిష్యత్తులో బీజేపీలో మంచి గుర్తింపు ఉంటుందని ఎలాంటి నిరాశకు గురి కావద్దని మనోధైర్యాన్ని కల్పించి లోకసభ ఎన్నికలలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. దీంతో ఈరోజు వరకు కూడా బీజేపీలోనే ఉండి, తనదైన శైలిలో దూసుకెళ్తున్న రాథోడ్ రమేష్ సడన్ గా బుధవారం సాయంత్రం ఒకరే అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు తన నామినేషన్ పత్రాన్ని సమర్పించడం జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

Spread the love

Related News

Latest News