Trending Now

రైతుల ప‌ట్ల సానుకూల నిర్ణ‌యం తీసుకోవాలి: బీఆర్‌ఎస్ నేత

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఇవాళ్టి కేబినెట్ స‌మావేశంలో సీఎం రేవంత్ రైతుల ప‌ట్ల సానుకూల నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కోరుతున్న‌ట్లు బీఆర్‌ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ‘రైతుబంధు ప‌థ‌కం గురించి చ‌ర్చించాలి. ప్ర‌ధానితో స‌హా చాలా మంది రైతుబంధు ప‌థ‌కాన్ని స్వాగ‌తించారు. పంట కోత‌ల త‌ర్వాత రేవంత్ ప్ర‌భుత్వం రైతుబంధు ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు రైతు భ‌రోసా అమ‌లు కాలేదు. రైతుభ‌రోసా అమ‌లు చేసి ఎక‌రాకు రూ.15 వేలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమే.. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందే.. తిట్ల మీద కాకుండా రైతులకు మేలు చేయడం పై కేబినెట్ మీటింగ్ లో చర్చించాలన్నారు. జూన్ మొదటి వారం లోనే రైతులకు ఎకరాకు 7,500 రూపాయలు విడుదల చేయాలి..ఆ దిశగా కేబినెట్ లో నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు సన్నవడ్లకే బోనస్ అని సీఎం అంటే కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కావన్నారు. తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఎంత ఉన్నా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News