ప్రతిపక్షం, ఏపీ: నరసరావుపేట మాజీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ”మార్చి 2న దాచేపల్లిలో జరగబోయే రా.. కదలిరా సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా.. ప్రజాసంక్షేమం, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మళ్లీ నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్న నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నా”.. అని ట్విట్ చేశారు. దీంతో ఆయనకు నరసరావుపేట నుంచి టీడీపీ టెకెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల లావు వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.