ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. 1958-1973 మధ్య ఆయన పాక్ తరఫున 41 టెస్టులు ఆడగా.. 2,991 పరుగులు చేశారు. ఈ క్రమంలో 5 సెంచరీలు సాధించిన ఆయన, అందులో 3 భారత్‌పైనే నమోదు చేశారు. ఆఫ్ స్పిన్ వేసే సయీద్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 22 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్‌తో జరిగిన 3 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించారు.