ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 6 : బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామ మాజీ సర్పంచ్ దశరథ భోజరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ళ నరేంద్ర మోడీ పాలన ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు, మళ్ళీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం వస్తేనే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కరిపే విలాస్, సీనియర్ నాయకులు చంద్ర ప్రకాష్ గౌడ్,రామ్ శంకర్ రెడ్డి, సాహెబ్ రావు, చెన్న రాజేశ్వర్, బడి పోతన్న,కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, తోట మల్లేష్, తిరుమల చారి, చాణక్య, కాల్వ నరేష్, ఈర్ల విజయ్, మైస శేఖర్, తదితరులు పాల్గొన్నారు.