ఇద్దరు వ్యక్తుల నుంచి రూ 4.15 లక్షలు వసూలు
ప్రతిపక్షం, సిద్దిపేట, జూలై 02: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల నుంచి రూ 4.15 లక్షలు వసూలు చేసిన సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ(50) అనే వ్యక్తి ప్రభుత్వ విద్యుత్ సంస్థ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడంతో ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇతని వద్ద టీవీ 5 ఐడెంటి కార్డు, యాంటీ కరప్షన్ ఇంటలిజెంట్ కమిటీ ఐడి కార్డ్, మరో రెండు రకాల ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ భాదితులు ఇంకా ఎవరైనా ఉంటే సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.