ప్రతిపక్షం, సిద్దిపేట, మే 17: సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పిల్లలకు ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమైనవి. సిద్దిపేట వ్యాస మహర్షి యోగా కేంద్రంలో జరిగిన ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న షిరిడి సాయిబాబా దేవాలయ ట్రస్టు అధ్యక్షులు గందె శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను ఈ తరానికి దగ్గర చేయడం అనివార్యం అన్నారు. యోగ, ప్రాణాయామం, ధ్యానం, శ్లోకాలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి అని చెప్పారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తోట అశోక్ మాట్లాడుతూ.. వేసవి సెలవులు పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ప్రకటించారు.
పిల్లలు శక్తివంతులుగా మారినప్పుడే చదువుల్లో కూడా మెరిసిపోతారని చెప్పారు. సంఘ ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సెల్ ఫోన్లు, టీవీలతో నేర్చుకున్న విద్య తరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ శిబిరం నేటి నుండి జూన్ 10వ తేదీ వరకు కొనసాగనుంది ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 8:30 వరకు కలదు. ఆసక్తి కలవారు 6302227030 ఫోన్ నెంబర్ కు సంప్రదించగలరు. రాష్ట్ర తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ టెక్నికల్ కార్యదర్శి, యోగశిక్షకులు తోట సతీష్, తోట సంధ్య, మనీషా పాల్గొన్న శిబిరంలో వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులు శిక్షణలో చేరారు.