ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా ప్రాజెక్ట్‌లలో ‘కల్కి 2898ఏడీ’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ కాగా, అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఇక ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మహా శివరాత్రి సందర్భంగా ప్రభాస్ పాత్ర పేరును రివీల్ చేశారు. పోస్టర్ ఆధారంగా ‘భైరవ’ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ఇందులో గాగుల్స్, స్లీవ్ లెస్ డ్రెస్, పోనిటైల్ హెయిర్, కండలు తిరిగిన బాడీతో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు రెబల్ స్టార్. ఈ లుక్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ ఫీల్ అవుతున్నారు.