గడ్డం వంశీకృష్ణ 1.26 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు
ప్రతిపక్షం, మంథని, జూన్ 4 : హోరా హోరిగా సాగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి గడ్డం వంశీకృష్ణ విజయకేతనం ఎగరవేశారు. సమీప బీజేపీ అభ్యర్థి పై లక్ష 50 వేల మెజారిటీతో ఆయన విజయ దుందుభి మోగించానున్నారు. మొదటి నుండి పెద్దపల్లి పార్లమెంట్లో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని అంచనా వేసిన, అనుహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మూడో స్థానానికి పడిపోగా, రెండో స్థానంలో ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి టికెట్ చేజిక్కించుకొని బీజేపీ నుండి పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ నిలిచారు. గడ్డం వంశీకృష్ణ 1.26 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలంలో గల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ నివాసంలో ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్న పార్లమెంటరీ ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఆయన తండ్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తో కలిసి ఎంపీగా తన విజయానికి కృషి చేసిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు.