ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 11 : ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల శనివారం నిర్మల్ లోని ఆయా ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాల కోసమని ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. ఎన్నికల ప్రత్యేక తనఖీ అధికారులు ఆమె వాహనాన్ని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లోని నచ్చన్ ఎల్లాపూర్ వద్ధ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు పది నిమిషాల పాటు ఆమె వాహనాన్ని తనఖీ చేసిన సంబంధిత అధికారులు ఏమి లేకపోవడంతో తిరిగి పంపారు. ఆమెతో పాటు నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు న్యాయవాది అల్లూరి కృష్ణవేణి, నిర్మల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంబరి గంగాధర్, సత్యనారాయణ, వాసవి, హరిక్రిష్ణ తదితరులు ఉన్నారు.