Trending Now

‘ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి’

ప్రతిపక్షం, గద్వాల్: ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని గద్వాల్ జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆసరా పెన్షన్ల కోసం 23, ధరణి సమస్యల పరిష్కారం కొసం 10 దరఖాస్తులతో పాటు మొత్తం 56 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యల పరిష్కారం పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కుమారి యన్. అక్షయకు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటుకు అర్హత పొందినందున ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. మునుముందు బాగా చదివి విజయాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రామచందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News