ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావం అంటే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 1969 – 2014 వరకు తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నారని.. కానీ 2014-23 వరకు దొర కేసీఆర్ కబంధ హస్తాలలో తెలంగాణ బంది అయ్యిందని గుర్తు చేశారు.. గడిలలో గొలుసులతో కట్టేసిన తెలంగాణకు ఇప్పుడు విముక్తి కలిగింది. తెలంగాణ ఉద్యమకారుడిగా 2024 జూన్ 2న నిజమైన తెలంగాణ వచ్చింది.
తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు సంతోషించే రోజు. దీనిని రాద్ధాంతం చేయడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదని విమర్శలు చేస్తున్నారు. 2004-09 వరకు ఎవరి కాళ్ళు మొక్కవో తెలియదా.. ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్లు ఎవరు ఉండవద్దు.. రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నుతాం అన్నావు అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ నా దీక్ష వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పుకున్నాడు.. అది దొంగ దీక్ష అని గజ్జల కాంతం ఫైరయ్యారు. కేసీఆర్ దొంగ దీక్షతో 12వందల మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం.. జైలుకు వెళ్ళలే.. ఆయన కుటుంబంలో ఎవరి చనిపోలేదు. వైఎస్ హయాంలో మంత్రి పదవులు ఎందుకు తీసుకున్నావు. 2009 లో ఎందుకు చంద్రబాబు తో పొత్తు పెట్టుకున్నావు..? ప్రశ్నించారు. శ్రీకాంత చారి చావుకు కేసీఆర్, కేసీఆర్ కుటుంబం కారణం. కేసీఆర్ దీక్ష విరమించడంతో నీ శవ యాత్ర రాష్ట్రం మొత్తం జరగలేదా..? అని ఆయన ప్రశ్నించారు.