ప్రతిపక్షం, గజ్వేల్: పోషకాహారం తీసుకోవడం ద్వారా బాలింతలు, తల్లులు ఆరోగ్యంగా ఉంటారని గజ్వేల్ ఐసీడీఎస్ సీడీపీఓ సరిత అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో అంగాన్ వాడి కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ వారోత్సవాలపై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిరుధాన్యలతో తల్లులు, పిల్లలు సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారని.. మహిళల్లో రక్తహీనత నివారణకు చిరుధాన్యాలు దోహదపడతాయన్నారు. అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఆకుకూరలతో పాటు కూరగాయలు, గుడ్లు, చేపలు వంటివి ఆహారంగా తీసుకోవాలన్నారు.
వాటితో పాటు చిరుధాన్యాలు రాగులు, పెసర్లు, బబ్బర్లు, సజ్జలు, జొన్నలు, కందులు, శనగలు, పల్లీలు, నువ్వులు తీసుకోవాలని సూచించారు. అనంతరం బాలామృతం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్ర మంలో పిహెచ్ సీ వైద్యాధికారి బల్ల మహారాజు, అంగన్వాడి సూపర్ వైజర్ షబానా, ఏస్ఐ రఘుపతి, ఏంపీహెచ్ఓ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ వినోద, పొషణ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ కిరణ్ పాండే, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, కేజీవీబీ ఎస్ఓ సుగంధ లత, ఏఈవో ప్రశాంత్, వివిధ గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.