కంపు కొడుతున్న డ్రైనేజీలు
చెత్త చెదారంతో నిండిపోయిన డ్రైనేజీలు
ప్రతిపక్షం, ప్రతినిధి సిరిసిల్ల జిల్లా, జూన్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పేరుకు మాత్రమే మండల కేంద్రం.. గ్రామ పంచాయతీ సర్పంచుల పదవి కాలం పూర్తవగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను గ్రామ పంచాయతీలకు కేటాయించింది. కానీ ఇప్పుడు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారుల పనితీరు ప్రజలకు శాపంగా మారింది. జీతాలు రాక సఫాయి కార్మికుల సమ్మెబాటతో చెత్త కుప్పలు పెరుగుపోయి మురికి కాలువలు చెత్తచెదారం నిండాయి. మండల కేంద్రంలో ముక్కు మూసుకుని నడిచే దుస్థితి నెలకొంది ఉదయం ప్రజలు నిద్ర లేవక ముందే రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచే సఫాయి కార్మికులు సమ్మబాట పట్టడంతో రోడ్లు, డ్రైనేజీలు మొత్తం చెత్తతో నిండిపోయాయి. ప్రధాన రహదారి గుండా నడవాలి అంటే ముక్కును మూసుకుని వెళ్లే దుస్థితి దాపురించింది. గ్రామపంచాయతీ అధికారులు మాత్రం ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకుని మురికి కాలువలను, రోడ్లపై ఉన్న చెత్తచెదారాలను లేకుండా చూడాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.