ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 12: మాదిగలు రాజకీయంగా అభివృద్ది చెందాలంటే ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్ట బద్దత కల్పించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి (MRPS – MPS) జాతీయ వ్యవస్థాపకులు బి ఎన్ రమేష్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన ఎమ్మార్పీఎస్ ఎంపీఎస్ సమావేశంలో మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నంగునూర్ మండలం కు చెందిన గంధమల్ల యాదగిరి నియమించారు. ఈ మేరకు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బి.ఎన్ . రమేష్ కుమార్ మాదిగ నియమాక పత్రాన్నియాదగిరికి అందజేశారు.
ఈ సందర్బంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ.. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ ల స్పూర్తితో ఉద్యమిస్తామని చెప్పారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమాకం అయిన గంధమల్ల యాదగిరి మాట్లాడుతూ.. మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగలు జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. నాపై నమ్మకంతో అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.