ప్రతిపక్షం, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు భరోసాల్లోని మరొకటి (మహాలక్ష్మి పథకం) రూ.500కే గ్యాస్ సిలెండర్ త్వరలో అమలు కాబోతోంది. అయితే చాలా మంది వినియోగదారులు అనుకుంటున్నట్లు డెలివరీ బాయ్ కి ఆ మొత్తమే చెల్లిస్తే సరిపోదట. సిలెండర్ బట్వాడా సమయంలో పూర్తి ధర చెల్లిస్తే, ఆ తరువాత రాయితీ మొత్తం ప్రత్యక్ష నగదు ద్వారా బదిలీ అవుతుందట (ప్రస్తుత కేంద్ర పభుత్వం తరహాలో). అలా పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్లు సమాచారం. అంటే ‘ముందు చెల్లించు.. తరువాత తీసుకో‘ అనే విధానమన్నమాట. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల లబ్ధిదారులను ఈ పథకం కిందకు తెస్తారట. ప్రస్తుతం కేంద్ర సిలెండర్ కు ఇస్తున్న రూ. 40 రాయితీని కూడా పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తోంది.