ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వేటువేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే దానంపై వేటు పడేలా చేస్తామని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.