ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి, నిర్మల్, జులై 04 : నీట్ పరీక్షల్లో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులను బహిష్కరించి కళాశాల బయట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు వి.మహేందర్ మాట్లాడుతూ..
నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగి నెల రోజులు గడిచినా కూడా ప్రధానమంత్రి ,కేంద్ర విద్యాశాఖ మంత్రులు కనీసం స్పందించకపోవడం విద్యార్థుల పట్ల ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుందని అన్నారు. 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అంధకారం చేసిందని అన్నారు.
వెంటనే ఎన్ టి ఏ సంస్థను రద్దు చేసి , మళ్లీ మళ్లీ నీట్ పరీక్షలను నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పూర్తి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఎంబడి.రాకేష్,జిల్లా అధ్యక్షులు సింగారీ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.దిగంబర్, AISF జిల్లా కన్వీనర్ కైలాష్ నాయకులు కిరణ్ ,శ్రావణ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.