ప్రతిపక్షం, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీ జోనాస్‌తో కలిసి బాలరామయ్య సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామజన్మభూమిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆమె తొలిసారి దర్శించుకున్నారు.