ప్రతిపక్షం, సినిమా: హాలీవుడ్ మూవీ ‘గాడ్జిల్లా’ కు ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. విజువల్ వండర్ గా తెరకెక్కే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు అందుకోవడమే కాదు.. భారీ వసూళ్లను కూడా రాబటి రికార్డ్స్‌ను క్రియేట్ చేశాయి. ఆడమ్ విన్ గార్డ్ దర్శకత్వంలో ‘గాడ్జిల్లా అండ్ కాంగ్: ది న్యూ ఎంపైర్ ’ అనే మూవీ రాబోతుంది. ఇందులో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కైలీ హాట్ల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా, తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ వేరే లెవల్ అని చెప్పాలి.. కింగ్ కాంగ్ జాతికి చెందిన కొన్ని జంతువులు భూమి మీద వినాశనం సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే అవి అధిక సంఖ్యలో ఉండటంతో కాంగ్ ఒక్కటే వాటితో పోరాడలేదు. దీంతో దానికి గాడ్జిల్లా సాయం అవసరం పడుతుంది. ఇక అలా కాంగ్ గాడ్జిల్లా కలిసి వాటిపై పోరాడి గెలిచారా లేదా అనేది సినిమా కథ.