Trending Now

ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. మళ్లీ రానున్న పాత బ్రాండ్లు..!

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం ఈనెల 14న కొత్త మద్యం పాలసీపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన పాలసీని రద్దు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 3600 మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచి, డిపాజిట్‌గా రూరల్ ప్రాంతంలో ఒక్కో షాపుకి రూ.45 వేలు, అర్బన్ ఏరియాలో రూ. 55 వేలుగా నిర్ణయించనుందట. ఇప్పటివరకు విక్రయించిన బ్రాండ్లను తీసేసి పాత బ్రాండ్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రస్తుత లిక్కర్ పాలసీ రద్దు దిశగా నిర్ణయం ఉంటుందని సమాచారం. ప్రస్తుత లిక్కర్ పాలసీ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ మందుబాబుల్లో ఆగ్రహం ఉంది. గతంలో తాము తీసుకునే బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మందు బాబులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఊరూపేరూ లేని బ్రాండ్లు తెచ్చారంటూ అప్పటి విపక్షనేత చంద్రబాబు కూడా ప్రతి సభలో విమర్శలు చేస్తూ వచ్చారు.

Spread the love

Related News

Latest News