Hyderabad Metro Change the Airport Metro Alignment: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్. మెట్రో మరో అడుగు తీసుకుంది. ఆరాంఘర్ బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి నూతన లైన్ ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకూ(కారిడార్4) 36.6 కి.మీ. మేర నూతన లైన్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు మెట్రో ఎండీ.. కారిడార్ల అలైన్మెంట్ తో పాటు కీలకమైన అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.
కారిడార్ 4: నాగోల్ – శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో 36.6 కి.మీ మేర నిర్మిస్తారు. ఎల్ బి నగర్, కర్మన్ఘాట్, చంద్రాయన్ గుట్ట, ఆరంఘర్, న్యూ హైకోర్టు మీదగా నిర్మించే ఈ మార్గంలో 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది.
కారిడార్ 5: రాయదుర్గ్ స్టేషన్ నుండి కోకాపేట్ నియోపోలిస్ వరకు బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా బ్లూ లైన్‌ను పొడిగిస్తారు.
కారిడార్ 6: ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపు.. ఓల్డ్ సిటీలోని మండి రోడ్, దారుల్షిఫా, శాలిబండ జంక్షన్, ఫలక్నుమా మీదుగా ప్రయాణిస్తుంది. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ వంటివి దీనికి సమీపంలో ఉండబోతున్నాయి.
కారిడార్ 7: ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపు.. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ప్రారంభించి, పటాన్చెరు వరకు ఉన్న ఈ 13.4 కిలీమీటర్ల లైన్ ఆల్విన్ X రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది.
కారిడార్ 8: ఎల్ బి నగర్ నుండి హయత్ నగర్ వరకు ఈ 7.1 కిమీ కారిడార్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్లో సుమారు 6 స్టేషన్లు ఉంటాయి.