Trending Now

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. పీఆర్​సీని ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శనివారం తీపికబురు చెప్పింది. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా గత ప్రభుత్వం తీవ్రజాప్యం చేసింది. దీంతో శాసనసభ ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు గంప గుత్తగా కాంగ్రెస్​పార్టీకి మద్దతు పలికారు. ఇప్పటి వరకు రెండు పీఆర్సీలు రావాల్సి ఉండగా ప్రభుత్వం ప్రస్తుతం ఒక్క పీఆర్సీని ప్రకటించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్‌సీని ప్రకటించారు. 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. కొత్త ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల భారం పడుతుందని వెల్లడించారు. అయితే దీనివల్ల 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.రుతుందని వివరించారు.

Spread the love

Related News

Latest News