ప్రతిపక్షం, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ పోస్టుల భర్తీలో భాగంగా ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో సైతం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యారోగ్య శాఖ సర్వీసుల బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.