ప్రతిపక్షం, దుబ్బాక ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ ఆకుల దేవేందర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ ఆ శయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్ నరేందర్, ఐరేని సాయితేజ గౌడ్ తదతరులు పాల్గొన్నారు.