ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గాంధీ భవన్‌లో ఘనంగా క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగగా.. మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బలనూరి వెంకట్, ఎమ్మెల్యే ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్ రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాస్ మూర్తి గారు పంచాంగ శ్రవణం చేశారు. ప్రజల అభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తుందని అన్నారు. వంద రోజులలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేసి ప్రజాదరణ పొందారని రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని అన్నారు.
అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. క్రోది నామ సంవత్సర కాలంలో కోపం తగ్గించుకుని కాంగ్రెస్ కార్యకర్తలు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలని.. పోయిన ఉగాది వేడుకల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అయ్యగారు చెప్పారు. అప్పుడు కొంత ఆశ్చర్యం కలిగిన మనం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాము అధికారం లోకి వచ్చాము..జనాలు అందరూ మనల్ని గెలిపించారన్నారు.