ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. సీఎస్కే ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి ఆరింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే గుజరాత్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగింట్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
బెంగళూరు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం..
పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో RCB 60 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 242 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ 181 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో రూసో (61), శశాంక్ సింగ్ (37) రాణించారు. సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. స్వప్నిల్ సింగ్, ఫెర్గ్యూసన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు తీశారు.
ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్..
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో పంజాబ్ కింగ్స్ నాకౌట్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఎలిమినేటైన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు నాలుగింటిలో గెలిచి ఎనిమిది ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. లీగ్ స్టేజ్‌లోనే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించడం పంజాబ్‌కు ఇది 15వసారి. ఒకే ఒక్కసారి ఫైనల్‌కు వెళ్లింది.