ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో భాగంగా నేడు KKR, GT అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి. కోల్‌కతా ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరింది. గుజరాత్‌కు మాత్రం ఇది చావో రేవో అన్న పరిస్థితి. ఈరోజు ఓడితే జీటీ కచ్చితంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సీఎస్కేపై హోం గ్రౌండ్‌లో గెలిచి ఊపుమీదున్న ఆ జట్టు అదే ఫామ్‌ను కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరం. కేకేఆర్ ఈరోజు గెలిస్తే పాయింట్స్ టేబుల్‌లో కచ్చితంగా తొలి 2 స్థానాల్లో నిలుస్తుంది.
ఢిల్లీపై ఆర్సీబీ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచులో ఆర్సీబీ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 140 పరుగులకే ఆలౌటైంది. DC బ్యాటర్లలో అక్షర్(57), హోప్(29) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ 3, ఫెర్గూసన్ 2, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
రికార్డు సృష్టించిన RCB..
IPL-2024లో వరుసగా 5 మ్యాచులు గెలిచిన జట్టుగా RCB రికార్డు సృష్టించింది. నిన్న ఢిల్లీపై 47 రన్స్ తేడాతో గెలవడంతో ఈ ఘనతను సాధించింది. తొలి 8 మ్యాచుల్లో ఒకటే విజయం సాధించిన బెంగళూరు, ఆ తర్వాత జరిగిన 5 మ్యాచుల్లోనూ గెలుపొందింది. GT(2 సార్లు), SRH, PBKS, DC జట్లను చిత్తుచేసింది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈనెల 18న చెన్నైతో కీలక పోరులో తలపడనుంది.