Trending Now

కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లోక్‌‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమిత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా, ఇటీవల గుత్తా సుఖేందర్ కేసీఆర్ ను విమర్శించిన విషయం తెలిసిందే.

ఇటీవల గుత్తా సుఖేందర్‌ కూడా పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. అధినేత కేసీఆర్, నాయకుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఆరు నెలలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, తనకే అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మిగతా వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఓటమిపై ఇప్పటి వరకు సమీక్ష చేయలేదని మండిపడ్డారు. దీంతో ఆయన కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన దానిని కొట్టిపడేశారు. ఇప్పుడాయన కుమారుడు సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేరడం బీఆర్ఎస్‌లో కలవరం రేపింది.

Spread the love

Related News