ప్రతిపక్షం, వెబ్ డెస్క్: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలవగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించింది. తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‍ల ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 5వ తేదీ నుంచి మూడు భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. కాగా, జియో సినిమాలో హిందీ, జీ5లో తెలుగు వెర్షన్‌ను చూడొచ్చు.