ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేఖలో కోరారు. అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కోరారు. మండల పరిషత్, పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. ఇకపై సినిమాలను మానేసి, రాజకీయాల్లోనే కొనసాగాలని ఆయన సూచించారు.